Viral News: జూనియ‌ర్ భార్య కావలెను.. లింక్డిన్‌లో జాబ్ ఆఫ‌ర్

Viral News: లింక్డిన్ వంటి వెబ్‌సైట్ల‌లో ఉద్యోగాల కోసం ఎన్నో ప్ర‌క‌ట‌న‌లు, పోస్ట్‌లు పెడుతుంటారు. అంత‌టి పెద్ద వెబ్‌సైట్‌లో ఓ వ్య‌క్తి ఏకంగా త‌న‌కు ఓ జూనియ‌ర్ పెళ్లాం కావాల‌ని పోస్ట్ పెట్టేసాడు. జితేంద్ర సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ దిక్కుమాలిన పోస్ట్ పెట్టి నెటిజ‌న్ల చేత బూతులు తిట్టించుకుంటున్నాడు.

“” అర్జెంట్ హైరింగ్..! నాకు ఓ జూనియ‌ర్ పెళ్లాం కావాలి. అనుభ‌వం ఉన్న‌వాళ్లు అప్లై చేయొద్దు. అనుభవం ఉన్న‌వారి కోసం నేను స‌ప‌రేట్‌గా మ‌రో పోస్ట్ పెడ‌తాను. ప్ర‌స్తుతానికైతే ఫ్రెష‌ర్స్ కావాలి. ఇది ప‌ర్మ‌నెంట్ పొజిష‌న్. జీతానికి సంబంధించిన అంశాలు కొన్ని కార‌ణాల వ‌ల్ల కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉంచుతున్నాను. అవ‌న్నీ సెలెక్ట్ అయ్యాక మాట్లాడ‌తాను. ఇక ఇంట‌ర్వ్యూ మాత్రం మూడు రౌండ్లు ఉంటాయి. అది కూడా ఫేస్ టు ఫేస్ ఉంటుంది. వంట చేయ‌డంలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. అర్థ‌రాత్రి నిద్ర‌లేచి మాంచి బిర్యానీ వండేలా ఉండాలి “” అని పోస్ట్ చేసాడు.

అయితే ఈ పోస్ట్ చివ‌ర‌లో తాను కేవ‌లం ఏదో స‌ర‌దాగా ఇలా పోస్ట్ పెట్టాన‌ని సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్ద‌ని కూడా చెప్పాడు. అయితే లింక్డిన్ వంటి ప్లాట్‌ఫాంలో పాపం చాలా మంది ఉద్యోగాలు లేక‌, ఉద్యోగాలు కోల్పోయి పోస్ట్‌లు పెడుతుంటార‌ని.. అలాంటి ప్లాట్‌ఫాంలో ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అత‌ని ఖాతాను తొల‌గించాల‌ని లింక్డిన్‌ను కోరుతున్నారు.