Resign: ఫస్ట్ జాబ్.. చేరిన మరుసటి రోజే రిజైన్
Hyderabad: ఓ వ్యక్తి కొత్త ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే రిజైన్ (resign) చేసేసాడు. ఇందుకు కారణం కంపెనీలో పని నచ్చకో.. తోటి ఉద్యోగులు నచ్చకో కాదు. రోజూ ఆఫీస్‌కి అంత దూరం ప్రయాణించలేక రిజైన్ చేసేసాడు. ఢిల్లీకి చెందిన శరత్ అనే వ్యక్తి స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు.
“” నాకు ఢిల్లీలో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. సాలరీ కూడా డీసెంట్‌గానే ఉంది. కానీ చేరిన మరుసటి రోజే నేను రిజైన్ (resign) చేసేసాను. ఇది నాకు తొలి ఉద్యోగం. కానీ మా ఇంటి నుంచి ఆఫీస్ దూరంలో ఉంది. దాంతో నేను ఒక్క రోజులో అంత దూరం ప్రయాణించేటప్పటికి విసిగిపోయాను. దాంతో రిజైన్ చేసేసాను. జాబ్ కోసం దగ్గర్లో ఇల్లు తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఏమైనా సలహా ఉంటే ఇవ్వండి “” అని పోస్ట్ చేసాడు.
విచిత్రం ఏంటంటే.. చాలా మంది నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతున్నారు ఈరోజుల్లో. నెల జీతం కోసం ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ అలసిపోతున్నవారు ఎందరో. అలాంటిది అంత దూరం ప్రయాణించలేక ఉద్యోగం వదిలేను ఏం చేయమంటారు అని అతను అడిగితే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. అదే ఉద్యోగం కోసం వేల మంది వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. బహుశా అతనికి ఇది తొలి ఉద్యోగం కాబట్టి అలా అనిపించిందేమో. అలవాటు చేసుకోకపోతే మాత్రం జీవితంలో పైకి రాలేవు అని సలహాలు ఇస్తున్నారు.