Uber: ఆటో బుక్ చేసుకుంటే.. రూ.7.66 కోట్ల బిల్లు!
Uber: ఉబర్ ఆటో బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. రూ.66కు ఆటో బుక్ చేసుకుంటే తాను దిగాల్సిన ప్రాంతంలో ఆటో ఆగాక ఆ బిల్లు కాస్తా రూ.7.66 కోట్లుగా చూపించింది. దాంతో ఆ వ్యక్తి కాస్తా కంగుతిన్నాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. పైగా ఆ వ్యక్తి నుంచి రూ.5 కోట్లను వెయిటింగ్ రుసుంగా కట్ చేసుకుంటామని మెసేజ్ కూడా పంపారు. దీని గురించి ఆ వ్యక్తి ఆటో డ్రైవర్‌తో గొడవపడ్డాడు. చంద్రయాన్‌లో ప్రయాణించినా కూడా ఇంత ఖర్చు అవ్వదు అంటూ మండిపడ్డాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే దీని గురించి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఉబర్‌ను ట్యాగ్ చేసాడు.
ఉబర్ సంస్థ దీనిపై స్పందిస్తూ.. క్షమాపణలు కోరింది. టెక్నికల్ సమస్య కావడంతో అంత మొత్తం చూపించిందని పేర్కొంది. అయితే ఈ మధ్యకాలంలో ఉబర్ డ్రైవర్లు డబ్బులు రాబట్టుకునేందుకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. రైడ్ బుక్ అవ్వగానే యాక్సెప్ట్ చేసి దగ్గరికి రాగానే క్యాన్సిల్ చేసేస్తున్నారు. దాంతో ప్యాసెంజర్‌కు రూ.70 జరిమానా పడుతోంది. కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవడంలేదని చాలా మంది ప్యాసెంజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది అమెరికాలోని నార్త్ కెరోలినాకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఇలాగే రైడ్లు క్యాన్సిల్ చేసి దాదాపు రూ.23.3 లక్షలు సంపాదించాడు.