నిశ్చితార్థం ఆపేసిన అధికారులు.. మైనర్ వధువు తల నరికేసిన వరుడు
Viral News: మైనర్‌తో నిశ్చితార్ధం చేసుకుంటున్నాడని తెలిసి బాలల హక్కుల కమిషన్ అధికారులకు సమాచారం అందడంతో వారు వెంటనే వెళ్లి వేడుకను ఆపేసారు. ఆ కోపంతో వరుడు మైనర్ వధువు తల నరికేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మడికెరి జిల్లాకు చెందిన ప్రకాశ్ అనే 32 ఏళ్ల యువకుడు మొన్ననే పదో తరగతి పరీక్షలో పాసైన బాలికతో నిశ్చితార్ధం పెట్టుకున్నాడు.
దీనిపై బాలల హక్కుల కమిషన్ అధికారులకు తెలిసిన వారు సమాచారం అందించడంతో వారు సమయానికి వేడుకు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తంతును అడ్డుకున్నారు. వరుడు ప్రకాశ్‌ను హెచ్చరించి వదిలేసారు. ఆ తర్వాత అధికారులు బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే అధికారులు వెళ్లిపోయిన కొన్ని గంటలకే ప్రకాశ్ బాలిక ఇంట్లోకి చొరబడి గొడ్డలితో ఆమె తల నరికేసాడు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.