భర్తను చదివిస్తే.. ఇలా రుణం తీర్చుకున్నాడు
Madhya Pradesh: ఓ మహిళ తన భర్తను చదివిస్తే మంచి ఉద్యోగం వచ్చి తనను బాగా చూసుకుంటాడు అనుకుంది. ఇందుకోసం ఇళ్లల్లో పాచి పనులు చేసేది. ఉదయమంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి భర్తకు వండిపెట్టేది. భర్త కోసం ఆ మహిళ ఇంత కష్టపడితే.. చివరికి అతను బాగా చదివి ట్యాక్స్ ఆఫీసర్ అయ్యి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) చోటుచేసుకుంది. దాంతో ఇప్పుడు మమత స్టోరీ కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే. మమత, కమ్రు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. కమ్రు చదువుకున్నాడు కానీ ఇంకా ఉద్యోగం లేదు. దాంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వమని మమత చెప్పింది.
అందుకు కావాల్సిన డబ్బు తాను పాచి పని చేసి సంపాదిస్తానని చెప్పింది. ఇందుకు కమ్రు కూడా ఒప్పుకున్నాడు. అలా కష్టపడి చదవి మొత్తానికి కమ్రు అనుకున్నది సాధించాడు. ఇప్పుడు అతను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాడు. ఇతనికి ఉద్యోగ రిత్యా రత్లాంలో పోస్టింగ్ పడింది. మమత మాత్రం మధ్యప్రదేశ్‌లోనే ఉండేది. దాంతో కమ్రు.. రత్లాంలో మరో మహిళతో పరిచయం పెంచుకుని ఏకంగా ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు. మమతను పుట్టింటికి పంపించేసాడు. ఆ తర్వాత మమతను అసలు కలవడమే మానేసాడు. దాంతో ఆమె పోలీస్ కేసు పెట్టింది.
కమ్రుకు కోర్టు నోటీసులు ఇవ్వగా.. కావాలంటే మమతకు విడాకులు ఇచ్చి నెల నెలా రూ.12000 ఇస్తానని చెప్పాడు. ఇందుకు మమత కూడా ఒప్పుకుని విడాకులు ఇచ్చేసింది. కొన్ని నెలల తర్వాత ఆ డబ్బు కూడా ఇవ్వడం మానేసాడు. దాంతో మమత మళ్లీ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ కేసు తీర్పు ఈ నెల 22కి వాయిదా పడింది.