Madhya Pradesh: సార్.. నా చెప్పులు దొరికాయా?
ఓ వ్యక్తి గుడికి వెళ్లి బయటికి వచ్చేసరికి తన చెప్పులు పోవడంతో ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో (madhya pradesh) చోటుచేసుకుంది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అతని చెప్పులు పోయి దాదాపు ఏడేళ్లు అవుతోంది. మరి ఇప్పుడెందుకు కంప్లైంట్ ఇచ్చినట్లు అనుకుంటున్నారా? అయితే ఈ కథ మీకు తెలియాల్సిందే. శివపురి ప్రాంతానికి చెందిన మహేంద్ర కుమార్ అనే వ్యక్తి ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇతను 2017లో రాజస్థాన్‌లోని చిట్టోరాగడ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయానికి వెళ్లాడు. ఆ సమయంలో చెప్పులు గుడి బయట వదిలాడు. తిరిగి వచ్చి చూసేసరికి అవి మాయం అయిపోయాయి. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసాడు.
ఊహించినట్లుగానే ఈ ఫిర్యాదుని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఇటీవల ఓ జడ్జి చెప్పులు కూడా ఇలాగే గుడిలో పోయాయట. ఈ విషయాన్ని మహేందర్ ఓ పత్రికలో చదివాడు. దాంతో తన చెప్పులు దొరికాయేమో తెలుసుకునేందుకు ఆ పత్రికను కట్ చేసి తాను ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదును కూడా జత చేసి పోలీస్ స్టేషన్‌కు పంపాడు. ఈ నేపథ్యంలో మహేందర్‌కు నిన్న పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కొన్ని చెప్పులు దొరికాయని అందులో ఏ చెప్పులు తనవో వచ్చి చూసుకోవాలని చెప్పారు. అయితే మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌కు వెళ్లి మరీ చెప్పులు తెచ్చుకోవాలా… అనుకుంటూ వెళ్లాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడు మహేందర్. (madhya pradesh)