Wife: భర్తను స్వీట్‌హార్ట్ అన్న వెయిట్రెస్.. ఇక ఊరుకుంటుందా?
భర్తను తన ముందే మరో ఆడది స్వీట్‌హార్ట్ అంటే ఏ భార్య (wife) అయినా ఊరుకుంటుందా? చీల్చి చెండాడేస్తుంది. అయితే ఈ స్టోరీలో అలా చేయలేని పరిస్థితి కాబట్టి ఓ భార్య ఏం చేసిందో చూడండి. అమెరికాకు (america) చెందిన ఓ భార్యా భర్త కలిసి సరదాగా డిన్నర్ చేయడానికి రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే ఆర్డర్ సర్వ్ చేసేటప్పుడు ఒక వెయిట్రెస్ (లేడీ వెయిటర్) ఆ వ్యక్తిని స్వీట్‌హార్ట్ అని సంబోధించింది. అసలు అలా పదాలు వాడకూడదు కానీ ఆమె మాత్రం సరదాగా ఏదో అనేసింది. దాంతో తన భర్తను పరాయి స్త్రీ స్వీట్‌హార్ట్ అనడం ఏంటి అని ఆమెకు ఒళ్లుమండిపోయింది. కాకపోతే అక్కడ గొడవ చేస్తే పరువు పోతుందని వేరేలా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది.
బిల్లు కట్టేటప్పుడు టిప్ కంపల్సరీగా ఇవ్వాలని అక్కడ రూల్. అయితే బిల్లు మాత్రమే కట్టి టిప్‌కి బదులు ఓ చీటీ రాసి పెట్టింది. అందులో నా భర్తను స్వీట్‌హార్ట్ అని పిలవకు అని రాసి ఉంది. దాంతో ఆ వెయిట్రెస్‌కి కోపం నవ్వు ఒకేసారి వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించడంతో వైరల్‌గా మారింది. విదేశాల్లో కాబట్టి స్వీట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అదే ఇండియాలో అయితే చంపేసేదే..! (wife)