Karnataka: అధికారిణి దారుణ హ‌త్య‌.. ఇంట్లోకి చొర‌బ‌డి మ‌రీ..

Karnataka: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ అధికారిణి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. మైన్స్ అండ్ జియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ప్ర‌తిమ (pratima) అనే అధికారిణి సుబ్ర‌హ్మ‌ణ్య‌పుర‌లోని త‌న ఇంట్లోనే హ‌త్య‌కు గుర‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆమెను క‌త్తితో పొడిచి చంపేసారు. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో ప్ర‌తిమ భ‌ర్త త‌న స్వ‌స్థ‌లం అయిన తీర్థ‌హ‌ళ్లిలో ఉన్నారు. ఈ ఘ‌ట‌న జ‌రిగినప్పుడు ప్ర‌తిమ ఒంట‌రిగా ఇంట్లో ఉన్నారు. నిన్న రాత్రి నుంచి ప్ర‌తిమ‌కు ఆమె సోదరుడు కాల్స్ చేస్తున్న‌ప్ప‌టికీ కాల్ లిఫ్ట్ చేయ‌క‌పోవడంతో ఈరోజు ఉద‌యం ప్ర‌తిమ ఇంటికి వెళ్లి చూసాడు. అప్ప‌టికే ప్ర‌తిమ ర‌క్త‌పుమ‌డుగుల‌లో చ‌నిపోయి ఉన్నారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో వారు విచార‌ణ ప్రారంభించారు.