Kerala: ఇక నుంచి కేరళ కాదు..!
Kerala: కేరళ (kerala) రాష్ట్రానికి కొత్త నామకరణం చేసారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ (pinarayi vijayan). ఇక నుంచి కేరళను కేరళం (keralam) అని పిలవాలని ఆదేశాలు జారీ చేసారు. అన్ని భాషల్లోనూ కేరళం అనే ఉండాలని, దీనిని రాజ్యాంగంలోనూ సవరించాలని బిల్లు పాస్ చేసారు. కేవలం మలయాళంలోనే రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తున్నామని, ఇతర భాషల్లో కేరళ (kerala) అంటున్నారని విజయన్ తెలిపారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ఇప్పటికీ కేరళ అనే ఉందని అన్నారు. దానిని కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరారు. ఈ నిర్ణయానికి అసెంబ్లీ స్పీకర్ కూడా ఆమోదం తెలిపారు.