Banglore నగరానికే ఇది అతిపెద్ద శత్రువు.. కోర్టు కామెంట్
బృహత్ బెంగళూరు మహానగర పాలకపై (BBMP) కర్ణాటక హైకోర్టు (karnataka high court) తీవ్రస్థాయిలో మండిపడింది. బెంగళూరు (banglore) నగరానికే అతిపెద్ద శత్రువు అని కామెంట్ చేసింది. నగరంలో ఎక్కువ అవుతున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లకు సంబంధించిన కేసు విషయంలో వాదనలు వింటూ కోర్టు ఈ విధంగా కామెంట్స్ చేసింది. బెంగళూరులో ఉన్న అనధికారిక హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలపై ఓ సమగ్ర సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 28 రోజుల్లో సర్వే పూర్తి చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని తెలిపింది.
అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన వారి నుంచి BBMP పన్నులు సేకరించకపోవడంతో ఆర్థికంగానూ సమస్యలు ఉన్నట్లు కోర్టు మండిపడింది. ఉచితంగా అక్రమంగా పెట్టేస్తున్న ఫ్లెక్సీలు, బిల్ బోర్డులు, హోర్డింగ్‌ల వల్ల బెంగళూరు నగరం లుక్ మారిపోతోందని.. ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.