Jet Airways: సంస్థకి లోన్ ఇస్తే.. బంగారం కొనుక్కున్నారు
జెట్ ఎయిర్వేస్ (jet airways) వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ (naresh goyal) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కెనరా బ్యాంక్ (canara bank)నుంచి రూ.800 కోట్ల వరకు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన నరేష్‌ను ఈడీ విచారించి అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా.. కెనరా బ్యాంక్ జెట్ ఎయిర్వేస్కు కార్యకలాపాల కోసం లోన్ ఇస్తే.. నరేష్ గోయల్ అతని భార్య అనిత బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి వాడుకున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. మొత్తం లోన్ నుంచి నరేష్ గోయల్ కుటుంబీకులు దాదాపు రూ.9 కోట్ల వరకు డబ్బు తీసి బంగారం, ఫర్నీచర్ కొనుగోలు చేయడమే కాకుండా.. తమ కూతురు నమ్రత గోయల్ ఇంట్లో పనిచేసేవారికి జీతాలు కూడా అదే లోను నుంచి తీసి వాడుకున్నారట. (jet airways)