ఏదో ఒక రోజు Amazon మునిగిపోతుంది

Hyderabad: ఏదో ఒక రోజు ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (amazon) మునిగిపోతుంద‌ని చెప్తున్నారు సీఈఓ జెఫ్ బేజోస్ (jeff bezos). ఈ విష‌యాన్ని 2018లో సియాటిల్‌లో జ‌రిగిన మీటింగ్‌లో బేజోస్ మీడియా ముందు చెప్పారు. ఏ కంపెనీ అయినా హిట్ అయితే 30 ఏళ్ల పాటు మాత్ర‌మే దృఢంగా ఉంటుంది కానీ వందేళ్లు అలాగే ఉండ‌దు క‌దా అని అన్నారు. అమెజాన్ (amazon) కూడా ఎప్పుడో ఒక‌ప్పుడు ఫెయిల్ అయ్యి డ‌బ్బుల్లేక మునిగిపోతుంద‌ని, అలాంటిది జ‌రిగిన‌ప్పుడు ఎవ్వ‌రూ ఆప‌లేరు కాబ‌ట్టి అలా జరిగితే ఏం చేయాలా అని ఇప్ప‌టినుంచే ఆలోచిస్తున్నాన‌ని బేజోస్ తెలిపారు. అయితే కోవిడ్ స‌మ‌యంలో 2022లో అమెజాన్ (amazon) సేల్స్ భారీగా ప‌డిపోయాయి. దాంతో ముందు ముందు ఎలాంటి న‌ష్టాలు జ‌ర‌గ‌కుండా దాదాపు 27 వేల మంది ఉద్యోగుల్ని తొల‌గించింది అమెజాన్. న‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు ఏ కంపెనీ కూడా నిల‌దొక్కుకోలేద‌ని, దానికి అమెజాన్ అతీతం కాద‌ని బేజోస్ తెలిపారు.