ఇక్కడ చావడం చట్ట విరుద్ధం..!
చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. ఫలానా చోట చావాలి అని ఈ ప్రదేశంలో చావకూడదు అనుకుంటే కుదరదు. అయితే ఓ ప్రాంతంలో మాత్రం చావడం అనేదే చట్ట విరుద్ధం అట. అదే ప్రదేశంలో.. ఇలాంటి వింత రూల్ అక్కడ ఎందుకు ఉందో తెలుసుకుందాం.
పై ఫోటో కనిపిస్తున్న ప్రదేశం పేరు లాంగియర్ బైయన్ (Longyearbyen). ఆర్కిటిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న స్వాల్‌బర్డ్ అనే ద్వీపసమూహంలో ఉంది. ఇక్కడ మంచు ఏ రేంజ్‌లో పడుతుందంటే.. ఇక్కడి ఉష్ణోగ్రత −13 నుంచి −20°C మధ్యలో ఉంటుంది. అంటే రక్తం గడ్డకట్టేంత చలి. ఇక్కడ ఎవరైనా చనిపోతే ఎంత కాలం అయినా కూడా శవాలు కుళ్లిపోకుండా ఉంటాయి.
1950ల్లో ఇక్కడ చనిపోయినప్పుడు ఆ శవాలు మంచులో కూరుకుపోయి కుళ్లకుండా ఉంటుండడంతో భయంకరమైన స్పానిష్ ఫ్లూ సోకుతోందని తెలిసింది.. దీని వల్ల చుట్టు పక్కల ప్రదేశాల్లో ఉన్న ప్రజలకు ప్రాణాపాయం ఉండటంతో ఈ ప్రదేశంలో ఎవ్వరూ చావకూడదు అనే నియమాన్ని పెట్టారు. ఈ ప్రదేశంలో నివసిస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వేరే ప్రదేశానికి వెళ్లిపోవాలి. ఈ లాంగియర్ బయన్ ప్రదేశంలో మహిళలు పిల్లల్ని కూడా కనడానికి వీల్లేదు. పిల్లల్ని కనడానికి రెండు నెలల ముందు వేరే ప్రదేశానికి వెళ్లిపోవాలి.
ఎందుకంటే ఈ లాంగియర్ బయన్ ప్రదేశంలో ఉన్న ఒకే ఒక్క హాస్పిటల్‌లో కనీస సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ ప్రదేశంలో టూరిస్టులకు మంచి స్పాట్ అవుతుంది కానీ అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్లినా వారంలోగా తిరిగి వచ్చేయాలని అక్కడి అధికారుల రూల్