Indore: 30 ఏళ్ల వరకే బతకాలనుకుని.. ఆత్మహత్య
ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు (suicide) చేసుకోవాలనుకునేవారికి ఆర్థిక సమస్యల కన్నా మానసిక సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి (indore). ముందు వెనకా ఆలోచించకుండా అన్నింటికీ చావే పరిష్కారం అనుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి మానసిక రోగంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా అతని చావుకి కారణం ఆర్థిక సమస్యలో ప్రేమ సమస్యలో కాదు. అతను కేవలం 30 ఏళ్ల వచ్చేవరకే బతకాలని అనుకున్నాడట.
ఇండోర్‌లో ఓ హోటల్ నడుపుతున్న ఈ వ్యక్తి.. తనకు 30 ఏళ్లు రాగానే చనిపోవాలని 2016లోనే నిర్ణయించుకున్నాడు. అందుకే అప్పుడే ఓ గన్ను కూడా కొని పెట్టుకున్నాడు. అతనికి నిన్ననే 30 ఏళ్లు నిండడంతో ఏకంగా ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ గన్నుతో కాల్చుకుని చనిపోయాడు. ఆ సూసైడ్ నోట్‌లో ఏముందో చదివి దానిని బట్టి విచారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. (indore)