కెనడా ద్వారా అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు
America: 2024లో మాత్రమే అధిక శాతంలో భారతీయులు కెనడా ద్వారా అమెరికాకు అక్రమంగా వలసపోతున్నారట. కేవలం ఈ ఏడాది జూన్ నెలలోనే దాదాపు 5,152 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా అమెరికాలోకి అక్రమంగా వలసపోయేవారు మెక్సికో దారి మీదుగా వెళ్తారు. 2023 వరకు ఇదే ట్రెండ్ నడిచింది.
కానీ ఇప్పుడు అక్రమ వలసదారులు రూట్ మార్చారు. మెక్సికో నుంచి కాకుండా కెనడా నుంచి అమెరికాలో తిష్ఠ వేస్తున్నారు. అమెరికా మెక్సికో సరిహద్దులో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. కానీ కెనెడా అమెరికా సరిహద్దు అతిపెద్దది. ఆ సరిహద్దు ద్వారా కెనడాలోకి అమెరికాలోకి సులువుగా వెళ్లిపోవచ్చు. 2023తో పోలిస్తే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య 43 శాతం పెరిగింది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో మూడో స్థానంలో ఉన్నవారు మన భారతీయులే కావడం ఆందోళన చెందాల్సిన విషయం.