Viral News: యాక్సిడెంట్లు అవ్వ‌కుండా పూజ చేయించిన పోలీస్!

Tamilnadu: యాక్సిడెంట్లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని ఓ హిజ్రా (trangender) చేత పూజ చేయించాడు ఓ పోలీస్. ఈ వైరల్ ఘ‌ట‌న (viral news) త‌మిళ‌నాడులో (tamilnadu) చోటుచేసుకుంది. వాన‌గ‌రమ్, మ‌ధుర‌వోయ‌ల్ రోడ్డులో యాక్సిడెంట్లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని భావించిన స్పెష‌ల్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ప‌ళ‌ని.. ఆ రోడ్డులో హిజ్రా చేత పూజ‌లు చేయించాడు. అక్క‌డేదో దుష్ట‌శ‌క్తి ఉంద‌ని అందుకే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయ‌ని మీడియాకు చెప్పాడు. ఆ రోడ్డులో గుమ్మ‌డికాయ‌తో దిష్టి తీయించి పూజ చేసిన నిమ్మ‌కాయ‌లు పెట్టించాడు. విష‌యం పై అధికారుల‌కు తెలీడంతో వెంట‌నే అత‌ను స‌స్పెండ్ చేసారు.

“ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. అలాగ‌ని వాటిని డ్యూటీలో చూపించ‌కూడ‌దు. యాక్సిడెంట్లు అవ్వ‌కుండా ట్రాఫిక్ కంట్రోల్ రూం ద్వారా మెరుగైన ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నాం. అంతేకానీ ఇలా పూజ‌లు చేయించ‌డాలు వంటివి చేస్తే డిపార్ట్‌మెంట్ ప‌రువు పోతుంది” అని పై అధికారి ఒక‌రు మీడియా ద్వారా వెల్ల‌డించారు.