స‌హ‌జీవ‌నం చేసి విడిపోయినా మెయింటైనెన్స్ ఇవ్వాల్సిందే..!

Viral News: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన హైకోర్టు ఈరోజు షాకింగ్ తీర్పు వెల్ల‌డించింది. సాధార‌ణంగా పెళ్లై విడాకులు తీసుకుంటే.. భార్య‌కు భ‌ర్త మెయింటైనెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. పెళ్లి కాక‌పోయినా చాలా కాలం పాటు స‌హ‌జీవ‌నం చేసి విడిపోయినా కూడా స‌ద‌రు వ్య‌క్తి మెయింటైనెన్స్ చెల్లించాల్సి ఉంటుంద‌ని కోర్టు తీర్పులో పేర్కొంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెంద‌ని శైలేష్ అనే వ్య‌క్తి.. అనిత అనే యువ‌తితో చాలా కాలం పాటు క‌లిసుంటున్నాడు. వీరిద్ద‌రూ ఆల‌యంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల విడిపోవాల‌ని అనుకున్నారు. కోర్టు విడాకులు మంజూరు చేస్తూ శైలేష్‌.. అనిత‌కు నెల నెలా రూ.1500 అలోవెన్స్ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఇందుకు శైలేష్ ఒప్పుకోలేదు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోలేద‌ని.. కేవ‌లం స‌హ‌జీవ‌నం మాత్ర‌మే చేస్తున్నామ‌ని అలాంట‌ప్పుడు తాను మెయింటైనెన్స్ ఎందుకు ఇవ్వాల‌ని ప్ర‌శ్నించాడు.

మ‌రోప‌క్క అనిత ఆల‌యంలో పెళ్లి చేసుకున్నామ‌ని రుజువు చేయ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ వీరిద్దరూ చాలా కాలంగా క‌లిసున్నారు అన‌డానికి.. వీరికి ఓ పాప ఉంది అన‌డానికి ఆధారాలు ఉండ‌డంతో న్యాయ‌మూర్తి మెయింటైనెన్స్ ఇచ్చి తీరాల్సిందే అని ఆదేశించారు.