Viral News: రోజూ శ‌వ‌పేటిక‌లో నిద్రపోతుంద‌ట‌..!

పిచ్చోళ్ల గురించి విన‌డ‌మే కానీ చూడ‌టం ఇదే మొద‌టిసారి అన్న‌ట్లు.. హాయిగా మంచంపై ప‌రుపు వేసుకుని ప‌డుకోక‌.. ఓ అమ్మాయి ఏకంగా శ‌వ‌పేటిక‌లో ప‌డుకుంటోంద‌ట‌ (viral news). ఇదంతా టిక్‌టాక్‌లో వ్యూస్, లైక్స్ కోసం చేస్తున్న స్టంటే కానీ ఆ అమ్మాయికి మాత్రం శ‌వ‌పేటిక‌లో ప‌డుకుంటేనే హాయిగా నిద్ర‌ప‌డుతోంద‌ట‌. దాంతో శ‌వ‌పేటిక‌లోనే ఓ మెత్త‌ని ప‌రుపును వేయించుకుంది. లిజ్ అనే 18 ఏళ్ల విదేశీ అమ్మాయి.. స్పైస్ సాడ్ పేరుతో టిక్‌టాక్ ఖాతాను నిర్వ‌హిస్తోంది. అయితే తాను ఎలా రోజూ శ‌వ‌పేటిక‌లో ప‌డుకుంటోందో ఫ్యాన్స్‌కి చూపించింది.

దాంతో అంతా షాక‌య్యారు. చ‌నిపోయిన త‌ర్వాత శ‌వ‌పేటిక‌లో ప‌డుకుంటే ఎలా ఉంటుంది అని ఇప్ప‌టినుంచే ప్రాక్టీస్ చేస్తున్నావా అంటూ నెటిజ‌న్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. అయినా ఆ కామెంట్స్‌ను లిజ్ అస్స‌లు ప‌ట్టించుకోదు. అదేంటో త‌న‌కు మంచంపై ఉన్న మెత్తని ప‌రుపుపై ప‌డుకుంటే మాత్రం అస్స‌లు నిద్ర‌ప‌ట్ట‌ద‌ట‌. అదే శ‌వ‌పేటిక‌లో ప‌డుకోగానే ఇట్టే నిద్ర‌ప‌ట్టేస్తుంద‌ని చెప్తోంది. ఈ పిచ్చి పిల్ల చేసే ప‌నిని మీరూ చూసేయండి.