Viral News: విమానంలో ప‌క్క‌నే మ‌నిషిని పోలిన మ‌నిషి.. సేమ్ పేరు..!

Viral News: మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌ని మ‌న పెద్ద‌లు చెప్తుంటారు. మ‌నలాంటి సాధార‌ణ వ్య‌క్తుల‌కు వారు క‌నిపించ‌రు కానీ.. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీల‌ను పోలిన వారు ఆల్రెడీ తెగ ఫేమ‌స్ అయిపోయారు. అయితే విమానంలో ఓ వ్య‌క్తికి త‌న లాంటి వ్య‌క్తే ప‌క్క సీటులో త‌గిలాడు. అత‌ను అచ్చం త‌న‌లాగే ఉండ‌టం చూసి షాక‌య్యారు. ఇంకా షాకింగ్ విష‌యం ఏంటంటే.. ఆ వ్య‌క్తి పేరు, హాబీలు, స్నేహితులు కూడా ఒక‌రే.. ! వింత‌గా ఉంది క‌దూ..!

ఈ విచిత్ర ఘ‌ట‌న థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. మార్క్ గార్లాండ్ అనే ట్ర‌క్ డ్రైవ‌ర్ ప‌ని మీద వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వ‌చ్చింది. ఇందుకోసం ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఆల్రెడీ చెకిన్ అయ్యాడు. తీరా చూస్తే ప‌క్క సీటులో త‌న లాగే ఉన్న 62 ఏళ్ల వ్య‌క్తి క‌నిపించాడు. అతన్ని చూసి మార్క్ షాక‌య్యాడు. అలా దాదాపు 11గంట‌ల పాటు క‌లిసి ప్ర‌యాణించారు. ఈ గ్యాప్‌లో మార్క్ త‌న‌ను పోలి ఉన్న వ్య‌క్తి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నాడు. అతని పేరు కూడా మార్క్ గార్లాండ్ అని తెలిసి షాక‌య్యాడు.

పేరు ముఖాలే కాదు.. వీరిద్ద‌రి ఫ్రెండ్స్, అల‌వాట్లు కూడా ఒక‌టే. వీరిద్దరి నివాసాల మ‌ధ్య దూరం కూడా 15 మైళ్లే..! మ‌రో షాకింగ్ విష‌యం కూడా ఉందండోయ్..! వీరిద్ద‌రికీ కూడా న‌లుగురేసి పిల్ల‌లు ఉన్నారు. కాక‌పోతే ఒక‌రు ఇంకా భార్య‌తో ఉన్నారు. మ‌రొక‌రు విడిపోయారు. వీరిద్ద‌రినీ చూసి తోటి ప్ర‌యాణికులు క‌వ‌ల పిల్ల‌లు అనుకున్నార‌ట‌. ఇలాంటి వింత బ‌హుశా కోటి మందిలో ఒకరికి జ‌రుగుతుందేమో..!  (Viral News)