Viral News: కొడుకుకి కాబోయే అత్త‌గారితో తండ్రి జంప్

in a viral news a Man falls in love with son's would be mother-in-law

Viral News: ఇల్లంతా పెళ్లి వాతావ‌ర‌ణం నెల‌కొంది. చుట్టాలంతా క‌బుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంత‌లో పిడుగు లాంటి వార్త‌. వ‌రుడికి కాబోయే అత్త‌గారితో అత‌ని తండ్రి జంప్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్రదేశ్‌లోని క‌స‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వ‌రుడి తండ్రి పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వెళ్లి వ‌రుడికి కాబోయే అత్త‌గారిని చూసి ఫిదా అయ్యాడు. ఆమె కూడా వ‌రుడి తండ్రికి ప‌డిపోయింది. అలా ఇద్ద‌రూ ఫోన్ నెంబ‌ర్లు తీసుకుని రోజూ ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి ఫిక్స్ చేసిన త‌ర్వాత వారిద్ద‌రూ లేచిపోయారు. దాంతో ఆ మ‌హిళ భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఇక్క‌డ మ‌రో షాకింగ్ విష‌యం ఏంటంటే.. లేచిపోయిన వ్య‌క్తికి ప‌ది మంది పిల్ల‌లు ఉండ‌గా.. మ‌హిళ‌కు ఆరుగురు పిల్ల‌లు ఉన్నార‌ట‌.