IIT Kanpur: స్పీచ్ ఇస్తూ కుప్ప‌కూలి చ‌నిపోయిన ప్రొఫెస‌ర్

IIT Kanpur ప్రొఫెసర్ విద్యార్ధుల‌కు స్పీచ్ ఇస్తూ ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయారు. ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించినా ఫ‌లితం లేకుండాపోయింది. ప్ర‌సంగం స‌మ‌యంలో ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు వైద్యులు తెలిపారు. స‌మీర్ ఖండేక‌ర్ (53) మెకానిక‌ల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నిన్న అలుమ్ని స‌మావేశం ఏర్పాటుచేసారు. ఈ స‌మావేశంలో స‌మీర్ మాట్లాడుతూ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. ఐదేళ్ల క్రిత‌మే ఆయ‌న‌కు కొలెస్ట్రాల్ లెవెల్స్ విప‌రీతంగా పెరిగిపోయి ఉన్నాయ‌ని స‌మీర్ కొలీగ్ తెలిపారు.