గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన IAS భార్య.. భర్త ఇంటి ముందే ఆత్మహత్య
గాంధీ నగర్‌కు చెందిన రంజీత్ కుమార్ గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్య జై పిల్లలను వేరొకరికి అమ్మేసే పనులు చేస్తోందని రంజిత్‌కు తెలిసింది. దాంతో ఇక సూర్యకు విడాకులు ఇచ్చి ఆమెను ఇంట్లోకి రానివ్వనని చెప్పాడు. దాంతో సూర్య తనకు పరిచయం ఉన్న గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయింది. ఆ తర్వాత అతను మోసం చేయడంతో మళ్లీ భర్త వద్దకే వచ్చింది. అతను రానివ్వకపోవడంతో ఆమె అతను ఉంటున్న ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.