Viral News: సెక్స్ చేయాలంటే డబ్బులు కట్టాలట.. కోర్టుకెక్కిన భర్త
Viral News: భార్యాభర్తలన్నాక అలకలు, ముద్దూముచ్చట్లు అన్నీ ఉంటాయి. కానీ భర్తతో మాట్లాడటానికి.. అతనితో శృంగారం చేయడానికి ఏ భార్య అయినా డబ్బులు డిమాండ్ చేస్తుందా? కానీ తైవాన్‌కి చెందిన ఓ మహిళ ఇలా తన భర్తను డబ్బు డిమాండ్ చేయడం స్థానికంగా వైరల్‌గా మారింది. తైవాన్‌కి చెందిన ఓ జంటకు 2014లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో ఆ మహిళ భర్తను దగ్గరికి రానిచ్చేది కాదు.
నెలకు ఒకసారే శృంగారం అని షరతు పెట్టిందట. ఇక 2019 నాటికి అసలు దగ్గరికి కూడా రానివ్వకుండా చేసింది. ఒకవేళ తనతో సెక్స్ చేయాలంటే 19 డాలర్ల వరకు చెల్లించాలని డిమాండ్ చేసింది. దాంతో అతను షాకయ్యాడు. వెంటనే తైవాన్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకులకు అప్లై చేసాడు. కోర్టు కౌన్సిలింగ్‌కు పంపగా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ఇక విడాకులు మంజూరు కరెక్ట్ అని కోర్టు ఆదేశించింది. అయితే ఇందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు. పై కోర్టుకు వెళ్లి తన విడాకులను రద్దు చేయాలని అప్పీల్ చేయడంతో దానిని కోర్టు రిజెక్ట్ చేసింది.