AI Courses: గూగుల్ నుంచి ఉచిత AI కోర్సులు..!

AI Courses: దిగ్గ‌జ టెక్ సంస్థ గూగుల్ (google) ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఉచిత కోర్సుల‌ను అందిస్తోంది. ఇంత‌కీ ఆ కోర్సులేంటో చూసేద్దాం.

జ‌న‌రేటివ్ ఏఐ

ట్రెడిష‌న‌ల్ మెషిన్ లెర్నింగ్ నుంచి వాటి పనితీరు వ‌ర‌కు ఈ జ‌న‌రేటివ్ ఏఐ కోర్సులో నేర్పిస్తున్నారు. ఏఐ గురించి డీప్‌గా తెలుసుకోవాలంటే ముందు ఈ బిగిన‌ర్ కోర్సు గురించి తెలుసుకోవాలి.

లార్జ్ లాంగ్వేజ్ మోడ‌ల్స్

ఇదొక ఎంట్రీ లెవ‌ల్ మైక్రో లెర్నింగ్ ప్రోగ్రామ్. దీని ద్వారా లార్జ్ లాంగ్వేజ్ మోడ‌ల్స్ గురించి ఒక క్లారిటీ వ‌స్తుంది. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడ‌ల్స్‌ని ఎక్కడ వాడాలో కూడా క్లియ‌ర్‌గా ఈ కోర్సులో తెలుసుకోవ‌చ్చు.

రెస్పాంసిబుల్ ఏఐ

అస‌లు ఏఐ టెక్నాల‌జీ అవ‌స‌రం ఏంటి అనే విష‌యాన్ని ఈ రెస్పాంసిబుల్ ఏఐ కోర్సు ద్వారా తెలుసుకోవ‌చ్చు. గూగుల్ వాడుతున్న 7 ఏఐ ప్రిన్సిప‌ల్స్‌ని కూడా ఈ కోర్సు తెలియ‌జేస్తుంది.

ఇమేజ్ జ‌న‌రేష‌న్

ఈ మ‌ధ్య‌కాలంలో ఈ జ‌న్మ‌లో చూడ‌లేని వింత‌ల‌ను ఏఐ ఫోటోల ద్వారా చూపించేస్తున్నారు. ఆ ఫోటోల‌ను ఏఐ ద్వారా క్రియేట్ చేస్తుంటారు. దానినే ఇమేజ్ జ‌న‌రేష‌న్ అంటారు. ఈ కోర్సు ద్వారా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఉప‌యోగించి ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది.