Viral News: 8 నిమిషాలు బ్రేక్ తీసుకున్న ఉద్యోగి.. బాస్ షాకింగ్ కామెంట్
Viral News: మంచి ఉద్యోగం మంచి జీతం ఉంటే చాలనుకుంటారు చాలా మంది. మంచి బాస్, మంచి ఆఫీస్ కల్చర్ కూడా ఉండాలి. లేదంటే ఎంత జీతం అందుకుంటున్నా అనుక్షణం ఇదేం బానిస బతుకురా బాబూ అన్న ఫీలింగ్ వల్ల జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. ఓ ఉద్యోగి సరిగ్గా పనిచేయకపోతే బాస్ వారిని తిట్టినా ఓ అర్థం ఉంటుంది. కానీ బాత్రూమ్‌కి వెళ్లడానికి ఓ 10 నిమిషాల బ్రేక్ తీసుకున్నందుకు కూడా తిడితే? ఇలా బాత్రూమ్‌కి వెళ్లి వచ్చినందుకు కూడా తిట్టే బాసులు ఉన్నారంటూ ఓ ఉద్యోగి రెడిట్‌లో తన స్టోరీ పోస్ట్ చేసారు.
“” నేను పనిచేస్తున్న కంపెనీ కొంతకాలం పాటు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చింది. వారం రోజుల క్రితం నేను మా బాస్‌తో మీటింగ్‌లో ఉండగా ఒక 8 నిమిషాల పాటు బాత్రూమ్ బ్రేక్ తీసుకున్నాను. నేను తిరిగి వచ్చేసరికి మా బాస్ ఇంత సేపేంటి అని గదమాయించారు. మనకు 8 నిమిషాల బాత్రూమ్ బ్రేక్ ఉంది కదా సర్ అన్నాను. దానికి ఆయన కోపంతో ఆ 8 నిమిషాల బ్రేక ఎందుకు.. ఒక రోజంతా సిక్ లీవ్ పెట్టేయాల్సింది అని వెటకారంగా మాట్లాడాడు. నాకు తల కొట్టేసినట్లు అయింది. నేను బాత్రూమ్‌కి కూడా వెళ్లకుండా పనిచేయాలంటే ఎలా “” అంటూ ఇలాంటి బాస్‌లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.