సిక్ లీవ్ పెట్టి విమానం ఎక్కిన ఉద్యోగి.. అదే విమానంలో మేనేజ‌ర్!

employee lied about her health and bumped into manager on flight

Viral News: ఒంట్లో బాలేదు అని మేనేజ‌ర్‌ను బురిడీ కొట్టించి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లే ఉద్యోగులు చాలా మందే ఉంటారు. కానీ అలా అబ‌ద్ధం చెప్పి మేనేజ‌ర్‌కు దొరికిపోతే ప‌రిస్థితి ఏంటి? ఇలాంటి ఘ‌ట‌నే ఓ యువ‌తికి ఎదురైంది. 23 ఏళ్ల గ్రేసీ అనే ఇండోనేసియా యువ‌తి ఫ్రీలాన్స‌ర్‌గా ప‌నిచేస్తోంది. అయితే ఓ రోజు సెల‌వు పెట్టి యూర‌ప్ వెళ్లాల‌నుకుంది. ఇందుకోసం.. త‌న‌కు ఒంట్లో బాలేద‌ని సిక్ లీవ్ పెట్టిన‌ట్లు మేనేజ‌ర్‌కు చెప్పింది.

అయితే గ్రేసీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న‌ప్పుడు ఆమె మేనేజ‌ర్ ఫోన్ చేసాడు. ఓప‌క్క ఎయిర్‌పోర్ట్‌లో గ‌ట్టిగా అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత గ్రేసీ ఫోన్ పెట్టేసి విమానం ఎక్కేసింది. త‌న సీటులో కూర్చుంటుండ‌గా.. త‌న మేనేజ‌ర్ కూడా అదే విమానంలో క‌నిపించాడు. దాంతో గ్రేసీ షాకైంది. సో.. ఇదేనా హాస్పిట‌ల్‌? అని వెట‌కారంగా ప్ర‌శ్నించాడు. గ్రేసీకి ఏమ‌నాలో తెలీక మౌనంగా త‌న సీటులో కూర్చుండిపోయింది. అయితే త‌న ఉద్యోగం ఉందా లేదా అనేది మాత్రం తెలియ‌రాలేదు.