Elon Musk: పేరు మారిస్తే రూ.100 కోట్లు ఇస్తా.. వికీపీడియాకు మస్క్ ఆఫర్
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (elon musk) వికీపీడియాకు (wikipedia) బంపర్ ఆఫర్ ఇచ్చారు. వికీపీడియా పేరును డికీపీడియా (dickipedia) అని మార్చుకుంటే 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.100 కోట్లు ఇస్తానని ట్విటర్ (X) ద్వారా వెల్లడించారు. ఎందుకంటే వికీపీడియా పేజీ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా పేజ్ డెవలప్ చేయడానికి తోచినంత డబ్బులు దానం చేయండి అని రిక్వెస్ట్ పెడుతోంది. దీనిపై మస్క్ తనదైన శైలిలో స్పందిస్తూ.. 1 బిలియన్ డాలర్లు ఇస్తానని కాకపోతే వికీపీడియా అని తీసేసి డికీపీడియా అని పెట్టుకోవాలని ఈ పేరు ఏడాది పాటు అలాగే ఉంచాలని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ చూసి కొందరు నెటిజన్లు మస్క్ బంపర్ ఆఫర్‌ను అస్సలు వదులుకోవద్దని వికీపీడియాకు సలహాలు ఇస్తున్నారు.
వికీపీడియాలో కంటెంట్ అప్‌లోడ్ చేసేందుకు ఆర్థిక సాయం కావాలని వికీపీడియా రిక్వెస్ట్ చేయడంపై మస్క్ స్పందించారు. వికీపీడియాలో దొరికేవన్నీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ చేస్తే కూడా దొరుకుతున్నప్పుడు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని ప్రశ్నించారు. వికీపీడియా ఫౌండర్ జిమ్మీ వేల్స్‌కి (jimmy wales) ఎలాన్ మస్క్‌కి మధ్య గతంలో ఓ వివాదం జరిగింది. టర్కీ అధ్యక్షుడు ప్రసంసగాన్ని మస్క్ సెన్సార్ చేయాలని అనడంపై జిమ్మీ వేల్స్ స్పందిస్తూ.. అది భావప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుందని అందులో సెన్సార్ చేయాల్సింది ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంలో మస్క్, వేల్స్‌కి మధ్య వాగ్వాదం నెలకొంది.