Delhi: పోలీస్ వేషంలో వ‌చ్చి రేప్..!

Delhi: ఓ ఆడ‌పిల్ల‌ని త‌న ఇంటి స‌మీపంలోనే దారుణంగా రేప్ (rape) చేసాడు ఓ రాక్ష‌సుడు. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని దిల్లీలో (delhi) చోటుచేసుకుంది. ర‌వి సోలంకి అనే యువ‌కుడు 20 ఏళ్ల యువ‌తిని త‌ను ఉంటున్న అపార్ట్‌మెంట్ స‌మీపంలోనే బెదిరించి రేప్ చేసాడు. తానో పోలీస్‌న‌ని చెప్పి వేరే కేసులో ఇరికిస్తాన‌ని బెదిరించి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. జులై 7న ఆ అమ్మాయి త‌న బాయ్‌ఫ్రెండ్‌తో కారులో ఉండ‌గా నిందితుడు ర‌వి సోలంకి వీడియో తీసాడు. ఆ త‌ర్వాత ఆ అమ్మాయిని డ్రాప్ చేయ‌డానికి వెళ్తుండ‌గా వారిని బైక్‌పై ఫాలో అయ్యాడు. ఆ అమ్మాయి ఉండే అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లోకి వెళ్లి ఆ అమ్మాయి ఇంటి బ‌య‌ట ఫోన్ మాట్లాడుతుంటే తానో పోలీసున‌ని చెప్పాడు. త‌ను బాయ్‌ఫ్రెండ్‌తో కారుతో ఉన్న వీడియోను చూపించి ఇది ఆధారంగా చేసుకుని కేసు న‌మోదు చేస్తాన‌ని బెదిరించి ఆ అమ్మాయిని లొంగ‌దీసుకున్నాడు. ఈ విష‌యం ఆ అమ్మాయి త‌న బాయ్‌ఫ్రెండ్‌కి చెప్ప‌డంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ప్ర‌స్తుతం నిందితుడు ర‌వి పోలీసుల అదుపులో ఉన్నాడు.