Viral News: మెట్రోలో లిప్ కిస్.. సెక్స్ కూడా కానిచ్చేస్తారేమో..?
Viral News: ఈ దేశంలో అతి దరిద్రమైన మెట్రో స్టేషన్ ఏదైనా ఉందంటే అది దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఇక్కడ టాపిక్ మెట్రో గురించి కాదు. అందులో ప్రయాణించే కొంత మంది దరిద్రులది. సమాజం ఏమనుకుంటుందో.. తమని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో అని కూడా పట్టించుకోని వాళ్లంతా ఈ ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తుంటారు.
డ్యాన్సులు, టిక్ టాక్ వీడియోలు, రీల్స్, గొడవలు, కొట్టుకోవడాలు ఇవన్నీ ఢిల్లీ మెట్రోలో రోజూ జరుగుతూ ఉంటాయి. వీటికి తోడు ఇప్పుడు రొమాన్స్లు ఎక్కువైపోయాయి. ఢిల్లీ మెట్రోలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి అనుకుంటుంటే ఇప్పుడు బెంగళూరు మెట్రో తయారైంది. ఓ జంట బెంగళూరు మెట్రో ఎక్కి అందరి ముందు లిప్ కిస్ ఇచ్చుకుంటుంటే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులను ట్యాగ్ చేసారు. మెట్రోలో ప్రయాణించేవారికి ఎంత అసౌకర్యంగా ఉంటుందో అని కూడా ఆలోచించరు. అసౌకర్యం గురించి పక్కన పెడితే కనీసం వారికైనా సిగ్గు ఉండక్కర్లేదా?
పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా ఇలాంటి వికృత చేష్టలు చేస్తే మందలించి వదిలేస్తారు. పోనీ తోటి ప్రయాణికులు వారికి క్లాస్ పీకాలని అనుకుంటే ఎదురు తిరుగుతున్నారు. నీ బాబు కట్టించిన మెట్రోనా? అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముద్దులతోనే ఆగారు. రేపు మెట్రోలో కింద పడుకుని మరీ శృంగారం చేసుకుంటున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఇతర ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కేవలం ఢిల్లీ, బెంగళూరులో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడంలేదు.