Ujjain Rape: బాలికను చదివించే బాధ్యత తీసుకున్న పోలీస్
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో అత్యాచారానికి గురైన బాలిక ప్రస్తుతం కోలుకుంటోంది (ujjain rape). ఈ నేపథ్యంలో ఆ బాలికను చదివించే బాధ్యత నాది అంటూ ముందుకొచ్చారు ఓ పోలీస్ అధికారి. స్థానిక మహాకాళ్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అజయ్ వర్మ అనే పోలీస్ బాలిక చదువుకు అయ్యే ఖర్చుతో పాటు చికిత్సకు కావాల్సిన ఖర్చును కూడా తానే పెట్టుకుంటానని ప్రకటించారు. బాలికను హాస్పిటల్లో చేర్పించినవారిలో అజయ్ వర్మ ఒకరు. చికిత్స చేస్తుంటే బాధ తట్టుకోలేక బాలిక అరుపులు విని తనకు కన్నీళ్లు ఆగలేదని అజయ్ వర్మ తెలిపారు. బాలిక తల్లిదండ్రుల వివరాలు తెలిసాయి కాబట్టి లీగల్గా ఎలా వెళ్లాలో అన్ని విషయాలు వారికి తెలియజేస్తానని.. ఒకవేళ బాలికకు తల్లిదండ్రులు లేకపోయి ఉంటే తానే దత్తత తీసుకునేవాడినని అన్నారు. (ujjain rape)