Chandrayaan 3: కంపించిన జాబిల్లి..!

భూమి కంపిస్తే దానిని భూకంపం అంటాం. భూమిపైనే కాదు.. చంద్రుడిపై ఉన్న ప్ర‌దేశం కూడా కంపిస్తుంద‌ట‌. దానినే మూన్ క్వేక్ (చంద్ర‌కంపం) అంటార‌ని ఇస్రో (isro) వెల్ల‌డించింది. భూమి కంపించిన‌ట్లే.. చంద్రుడిపై కూడా ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌ని ఇస్రో తెలిపింది. ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌తో పాటు ఇత‌ర పే లోడ్స్ జాబిల్లిపై తిరుగుతున్నందుకు ఈ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌ని ఇస్రో వెల్ల‌డించింది. (chandrayaan 3)