Chandrayaan 3: విక్రమ్.. స్మైల్ ప్లీజ్…!
చంద్రుడిపై బుడి బుడి అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి విక్రమ్ ల్యాండర్ (vikram lander) ద్వారా ఇస్రోకు (isro) చేరవేస్తోంది ప్రజ్ఞాన్ రోవర్ (pragyan rover). చంద్రయాన్ 3లో (chandrayaan 3) భాగంగా జాబిల్లిపైకి వెళ్లిన మన స్పేస్‌క్రాఫ్ట్.. వారం రోజుల్లో ముఖ్యమైన సమాచారాన్ని సేకరించింది. కాగా.. ఈరోజు ప్రజ్ఞాన్ రోవర్.. విక్రమ్ ల్యాండర్ ఫొటోను తీసి పంపింది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడిస్తూ విక్రమ్ ఫోటోను షేర్ చేసింది.
ఇక జాబిల్లిపై సల్ఫర్, ఆక్సిజన్, టైటానియం, అల్యుమినియం, కాల్షియం, ఐరన్, హైడ్రోజన్, క్రోమియం, మాంగనీస్, సిలికాన్ ఖనిజాలు ఉన్నాయని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. మిగతా ఖనిజాలతో పోలిస్తే.. చంద్రుడిపై సల్ఫర్ ఉండటం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. ఎందుకంటే.. సల్ఫర్ ఉందంటే… ఆటోమేటిక్‌గా నీటి వనరులు ఉండే అవకాశం ఉంటుంది. దీని వల్ల మనుషులు కూడా చంద్రుడిపై నివసించే అవకాశం ఉంటుంది. (chandrayaan 3)