Asia Cup 2023: అందుకే చాహల్‌ను తీసుకోలేదు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న ఏసియా కప్ 2023 (asia cup 2023) క్రికెటర్ల లిస్ట్ రిలీజ్ అయిపోయింది. రోహిత్ శర్మ (rohit sharma) కెప్టెన్సీలో 18 మంది ఆడబోతున్నారు. రోహిత్‌కి డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.
పాకిస్థాన్‌తో ఆడబోయే మ్యాచ్ గురించి రోహిత్ మాట్లాడుతూ.. బెంగళూరులో 5 రోజులు క్యాంప్‌లో ఉన్నాం. చాలా కాలం తర్వాత అందరు ప్లేయర్లను ఒక దగ్గర చేర్చి ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. దీని ద్వారా మా బలహీనతలను రెక్టిఫై చేసుకోవచ్చు. పోయినసారి ఏసియా కప్‌ను శ్రీలంక కూడా గెలిచింది. కేవలం పాకిస్థాన్ కోసమనే కాదు ఇతర మ్యాచ్‌లకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.
బుమ్రా గురించి మాట్లాడని రోహిత్
గాయం తర్వాత బుమ్రా మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఏసియా కప్‌లో చోటుదక్కించుకున్నాడు. అతని గాయం గురించి భయాందోళనలు లేవా అని అడిగితే.. గాయాలు, శారీరక ఫిట్‌నెస్ గురించి మేనేజ్‌మెంట్, ట్రైనర్లు చూసుకుంటారు. అది నాకు సంబంధం లేదు. (asia cup 2023)
ఈసారి చాహల్‌ని ఎందుకు ఎంపికచేయలేదు అని అడిగితే.. ఒకేసారి ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లు అవసరం లేదు. చెప్పాలంటే ఇప్పుడు చాహల్ (yuzvendra chahal) కంటే కుల్దీప్ యాదవ్ (kuldeep yadav) ముందున్నాడు.
జాబితా ఇదే..
బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్
బౌలర్లు: శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
రిజర్వ్: సంజు సాంసన్ (asia cup 2023)