Free Bus Travel: తెలంగాణ‌లోని క‌ర్ణాట‌క వాసులకు వ‌ర్తిస్తుందా?

Free Bus Travel: తెలంగాణ‌లో కాంగ్రెస్ (telangana) ప్ర‌భుత్వం అమ‌ల్లోకి రాగానే తెలంగాణ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం వ‌ల్ల తెలంగాణ‌లో కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి అనుకుంటే.. ఇప్పుడు కొత్త స‌మ‌స్య మొద‌లైంది. క‌ర్ణాట‌క‌లోనూ (karnataka) కాంగ్రెస్ ప్ర‌భుత్వమే అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

క‌ర్ణాట‌క ఆధార్ కార్డుతో తెలంగాణ‌లో నివసిస్తున్న మ‌హిళ‌లు ఇక్కడి బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించాలా వ‌ద్దా అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ ముస్లిం మ‌హిళ తెలంగాణ‌లో ఉద్యోగం చేసుకుంటూ అక్క‌డి ఆధార్ కార్డు చూపించి ఉచితంగా తెలంగాణ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న అంశం బ‌య‌టికి వ‌చ్చింది.

క‌ర్ణాట‌క ఆధార్ కార్డు ఇక్క‌డ చెల్ల‌దు అని కండ‌క్ట‌ర్ ఎంత చెప్పినా కూడా ఆమె విన‌కుండా నేను టికెట్ తీసుకోను కాక తీసుకోను అని మొండికేసింది. దాంతో ప్రయాణికులు కూడా ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆమె వీడియోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. మ‌న తెలుగు రాష్ట్రం అయిన ఏపీ మ‌హిళ‌ల‌నే బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌నివ్వ‌డంలేదు. అలాంటిది క‌ర్ణాట‌క నుంచి వ‌చ్చి ఇక్క‌డ ఉచితంగా ప్ర‌యాణిస్తాను అక్క‌డ కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే క‌దా ఉంది అని మ‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి ద‌బాయిస్తే ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకుంటుందో లేక త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.