ఫాలోవర్లను నమ్మించి.. సెక్స్ వర్కర్లుగా మార్చిన ఇన్‌ఫ్లుయెన్సర్
Viral News: తాను ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో (టైటానిక్ హీరో) ప్రేయసినని.. తనకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను నమ్మించి వారిని సెక్స్ వర్కర్లుగా మార్చింది బ్రెజిల్‌కి చెందిన ఓ మోడల్. క్యాట్ టోర్రెస్ అనే యువతి మోడలింగ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెల్సర్‌లా మారి డబ్బులు సంపాదిస్తోంది. అయితే.. తనను ఫాలో అయ్యే ఆడవాళ్లకు తన దగ్గర ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని.. వాటి ద్వారా ఎలాంటి కోరికలైనా నెరవేరేలా చేస్తానని.. అలాంటివారు ఎవరైనా ఉంటే తనను కలవచ్చని చెప్పింది. అలా చాలా మంది మగవాళ్లు, ఆడవాళ్లను ఆమెను కలిసేవారు. అలా తన వద్దకు వచ్చిన వాళ్లను వేరే వాళ్లకు అమ్మేసి వారిని సెక్స్ వర్కర్లుగా, బానిసలుగా మార్చి డబ్బులు తీసుకునేది.
అలా 2019లో ఇద్దరు యువతులు ఆమె మాటలు నమ్మి న్యూయార్క్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు వెళ్లారు. వాళ్లిద్దరితో క్యాట్ అడ్డమైన పనులు చేయించుకుని చివరికి వ్యభిచారంలోకి కూడా దించింది. అలా ఆ ఇద్దరు యువతుల కోసం వారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టగా.. క్యాట్ అక్రమాలు బయటపడ్డాయి. రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత స్థానిక న్యాయస్థానం క్యాట్‌కి ఎనిమిదేళ్లు కారాగార శిక్ష విధించింది.