Viral News: అస‌హ‌జ శృంగారం నిరాక‌రించాడ‌ని బాలుడి హ‌త్య‌

Viral News: ఓ వ్యక్తి బాలుడిని లైంగికంగా వేధించి అస‌హ‌జ శృంగారం చేయాలని వేధించి చివ‌రికి బాలుడు ఒప్పుకోలేద‌ని చంపేసిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. న‌వీ ముంబైలో 12 ఏళ్ల బాలుడి మృత‌దేహ ల‌భించ‌డంతో ఆ ప్రాంతం ఒక్క‌సారిగా వ‌ణికిపోయింది. పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా.. ఠాకూర్‌పాడా ప్రాంతం నుంచి ఇద్ద‌రు వ్య‌క్తులు బాలుడిని కిడ్నాప్ చేసారు. బాలుడి చేత అస‌హ‌జ శృంగారం చేయించుకోవాల‌నుకున్నారు. తీరా బాలుడు ఒప్ప‌కోక‌పోయే స‌రికి చేతులు క‌ట్టేసి త‌ల‌పై కొట్టి హ‌త్య చేసారు. మృత‌దేహాన్ని త‌లోజా స‌రస్సులో ప‌డేసారు. ఈరోజు ఉద‌యం బాలుడి మృత‌దేహాన్ని చూసి స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా ఇద్ద‌రు ముస్లిం సోద‌రులు ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్లు క‌నుగొన్నారు. వెంట‌నే వారిని అదుపులోకి తీసుకున్నారు.