రెండోసారి గర్భం దాల్చిన ఉద్యోగి.. పీకేసిన బాస్
Boss: ఓ ఉద్యోగి రెండోసారి గర్భం దాల్చిందని తెలిసి ఉద్యోగం నుంచే తీసేసారు. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. యూకేకి చెందిన ఫస్ట్ గ్రేడ్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీలో అడ్మిన్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది నికితా అనే యువతి. ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో ఆరు నెలల పాటు మెటర్నిటీ సెలవులు తీసుకుంది. మెటర్నిటీ సెలవులు ముగిసిన నెలకే మళ్లీ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన బాస్‌కి చెప్పింది. దాంతో అతను మండిపడ్డాడు. అయినా నికితా ఏమీ పట్టించుకోలేదు. కొన్ని నెలలు గడిచాక మళ్లీ మెటర్నిటీ సెలవులు తీసుకుంది. అయితే మెటర్నిటీ సెలవులు పూర్తి కావొస్తున్న సమయంలో ఆఫీస్‌కి ఎప్పుడు వస్తారు అని కూడా కంపెనీ నుంచి ఎలాంటి మెయిల్ రాలేదట. కనీసం మెటర్నిటీ బిల్లులు కూడా చెల్లించలేదని నికితానే స్వయంగా ఆఫీస్‌కి మెయిల్ పెట్టింది.
ఆమె మెయిల్స్‌కి బాస్ నుంచి ఎలాంటి రిప్లై లేదు. కొన్ని రోజుల పాటు మెయిల్స్ చేసాక తన బాస్ నుంచి రిప్లై వచ్చింది. కంపెనీలో కొత్త సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయించుకున్నామని ఇక నీ సర్వీస్ కంపెనీకి అవసరం లేదని ఆ రిప్లైలో రాసుంది. దాంతో నిఖిత ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యూనల్ సాయం కోరింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ట్రిబ్యూనల్ నిఖిత రెండోసారి గర్భం దాల్చి మెటర్నిటీ సెలవులు తీసుకోవడం వల్లే ఉద్యోగం నుంచి తొలగించారని.. పైకి మాత్రం సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేసామని అబద్ధం ఆడారని తీర్పు చెప్పింది. అంతేకాదు కంపెనీ చేత నిఖితకు రూ.30 లక్షల వరకు పరిహారం కూడా ఇప్పించారు.