Bhadrachalam: ప్రధాన అర్చకుడి వక్ర బుద్ధి.. కోడలితో బిడ్డ కావాలంటూ
Bhadrachalam: భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులను దేవాలయ ఈవో రమాదేవి సస్పెండ్ చేసారు. అతనితో పాటు ఆయన దత్తపుత్రుడు, ఆలయ అర్చకుడు తిరుమల వెంటక సీతారాంను కూడా విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఇందుకు కారణం వీరిద్దరిపై లైంగిక వేధింపులు, వరకట్న వేధింపుల కేసు నమోదవ్వడమే. ఈ విషయాన్ని వీరిద్దరూ ఈవో దగ్గర దాచి విధుల్లో చేరడం.. ఇటీవల విషయం వెలుగులోకి రావడంతో వారిని తొలగించారు.
సీతారామానుజాచార్యులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా ఆయన ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు. 2019లో తాడేపల్లిగూడెంకి చెందిన ఓ యువతితో తన దత్తపుత్రడి పెళ్లి చేసారు. పెళ్లైనప్పటి నుంచి కోడలిని వేధింపులకు గురిచేస్తున్నారు. 10 లక్షల కట్నం తీసుకురావాలని ఆడపడుచులు పీక్కుతినేవారు. ఇది చాలదన్నట్లు అంతటి పెద్ద పదవిలో ఉన్న సీతారామానుజాచార్యులు కోడలి పట్ల వక్రబుద్ధి ప్రదర్శించాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన భర్తకు చెప్పగా.. అతను తన తండ్రికే మద్దతు తెలిపాడు. పైగా ఇలాంటి ఆరోపణలు చేస్తావా అంటూ భార్య చేత క్షమాపణలు చెప్పించాడు.
ఈ నేపథ్యంలో సీతారామానుజాచార్యులు మరీ రెచ్చిపోయారు. తనకు ఆస్తి బాగా ఉందని కానీ కొడుకు లేని లోటు ఇప్పటికీ ఉందని కోడలిని మరింత వేధించాడు. పైగా తనలాంటి కొడుకు కావాలని ఇస్తావా అంటూ అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఇవన్నీ భరించలేక ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 14న కేసు నమోదవ్వగా ఈ విషయాన్ని ఈవో దగ్గర దాచిపెట్టడంతో వెంటనే వీరిని సస్పెండ్ చేసారు.