Investment: పిల్లల కోసం బెస్ట్ ప్రభుత్వ పథకాలు ఇవే..!
Investment: పిల్లల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రభుత్వం అందిస్తున్న బెస్ట్ పథకాలేంటో తెలుసుకుందాం. ఈ పథకాల వల్ల పిల్లలు తమకు అవసరమైన ఖర్చుల కోసం మరే చోటా వెతుక్కోనక్కర్లేదు.
సుకన్య సమృద్ధి యోజన
ఇది ఆడపిల్లల కోసం మాత్రమే. అది కూడా పది సంవత్సరాలు లోపున్న అమ్మాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పది సంవత్సరాల కంటే ఒక రోజు ఎక్కువ వయసున్న ఈ పథకానికి అర్హులు కారు. పుట్టినప్ప రోజు నుంచి పదేళ్ల వరకు ఈ పథకాన్ని తెరిచే అర్హత ఉంటుంది. సంవత్సరానికి రూ.250 నుంచి రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టచ్చు. ఎప్పుడైనా మర్చిపోతే రూ.50 పెనాల్టీ పడుతుంది. ఇది ఇద్దరు ఆడపిల్లలు ఉంటేనే ఇస్తారు. ముగ్గురు, నలుగురు ఉంటే వర్తించదు.
మొదటి కాన్పులో ఒక ఆడపిల్ల పుట్టి రెండో కాన్పులో కవల ఆడపిల్లలు పుడితే రెండో కాన్పులో పుట్టిన ఇద్దరికీ ఇస్తారు. అలా కాకుండా మొదటి కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టి.. రెండో కాన్పులో ఒక ఆడపిల్ల పుడితే ఈ పథకం వర్తించదు. మీ అమ్మాయికి ఐదు సంవత్సరాలు ఉంటే.. ఐదు సంవత్సరాల నుంచి 21 ఏళ్లు కలుపుకుని మీ అమ్మాయికి 26 ఏళ్లు వచ్చే సరికి మీరు మొత్తం మెచ్యూరిటీ డబ్బు తీసుకోవచ్చు. అలా కాకుండా అమ్మాయి పుట్టిన మరుసటి రోజే మీరు ఈ పథకాన్న తెరిస్తే అమ్మాయికి 21 లేదా 22 ఏళ్లు వచ్చే సరికే మొత్తం మెచ్యూరిటీ డబ్బు తీసుకునే వెసులుబాటు ఉంది.
ఈ పథకం గడువు కాలం 21 ఏళ్లు ఉంటుంది. అలాగని మీరు 21 ఏళ్ల పాటు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాలు మాత్రం కడితే సరిపోతుంది. మిగిలిన 6 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకపోయినా వడ్డీ మాత్రం జనరేట్ అవుతుంటుంది. ఇది చాలా మంది వడ్డీ ఇచ్చే పథకం. అయితే మీరు డబ్బులు వేయడం మొదలుపెట్టిన వెంటనే విత్‌డ్రా చేసుకోవడానికి ఉండదు. మినిమం ఐదేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ లాకిన్ పీరియడ్ ముగిసాక తీసుకోవచ్చు. (Investment)
ఒకవేళ మీరు కొన్ని కారణాల వల్ల ఈ పథకంలో డబ్బు కట్టలేక ఆపేయాలనుకుంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటంటే.. మీ అమ్మాయికి ఏదన్నా వ్యాధి వచ్చి చికిత్సకు డబ్బులు కావాలన్నా… లేదా ఆ అమ్మాయి తల్లిదండ్రులు, లేదా డబ్బులు కడుతున్న గార్డియన్ చనిపోయినా ఈ పథకంలోని డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకం నుంచి ప్రస్తుతానికి 8.2 శాతం వడ్డీ వస్తోంది. కానీ ఏటా మారే అవకాశం ఉంది.
ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఎలాంటి పన్ను కట్టాల్సి ఉండదు. మీరు ఈ పథకం తీసుకోవాలనుకుంటే ప్రస్తుతానికి ఆన్లైన్లో ఓపెన్ చేసే అవకాశం లేదు. మీకు దగ్గర్లోని ఏ బ్యాంక్‌లో అయినా వెళ్లి అడిగే వాళ్లు అప్లికేషన్ ఫాం ఫిల్ చేయమని అడుగుతారు. అలా బ్యాంకుల్లో ఈ పథకాన్ని ఓపెన్ చేసుకోవచ్చు.
సోవరిన్ గోల్డ్ బాండ్స్
ఇక రెండో బెస్ట్ ప్రభుత్వ పథకం ఏంటంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్. 2004 నుంచి 2024 వరకు బంగారం ధర పెరుగుతూనే వచ్చింది కానీ ఎక్కడా తగ్గలేదు. మధ్య మధ్యలో కాస్త తగ్గినా కూడా ఆ తర్వాత అది అమాంతం పెరుగుతూనే ఉంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే.. గోల్డ్ రేట్స్ పెరుగుతూ ఉంటే ఏ డబ్బు అయితే మీకు వస్తుందో దాని మీద రూపాయి ట్యాక్స్ ఉండదు. దాంతో పాటు ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ ఖాతాలో పడుతూ ఉంటుంది.
ఈ గోల్డ్ బాండ్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గత 40 ఏళ్లలో కేవలం 7 సార్లు మాత్రమే బంగారం ధర పడిపోయింది. అది కూడా చాలా తక్కువ శాతమే పడిపోయింది. కాబట్టి గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. గోల్డ్ బాండ్స్ రెండు రకాలుగా కొనుగోలు చేయొచ్చు. ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయని ప్రకటన ఇస్తూ ఉంటుంది. లేదంటే స్టాక్ మార్కెట్ నుంచి కూడా కొనుగోలు చేయచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్య అంశం ఏంటంటే.. మీరు బాండ్స్ కొంటే 8 ఏళ్లు అలాగే ఉంచాలి. ఒకవేళ 8 ఏళ్ల లోపు మీరు రిడీమ్ చేసుకుంటే దానిపై ట్యాక్స్ పడదు. ఆ ఎనిమిదేళ్ల లోపే మీరు ఇంకొకరికి అమ్మాలనుకుంటే మాత్రం కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఇక మూడో పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఎవరైనా వేయచ్చు. ప్రతి ఏటా 1,50,000 వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ట్యాక్స్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకైనా పొడిగించుకోవచ్చు. 15 ఏళ్ల పాటు మెచ్యూరిటీ టైం ఉంటుంది. 7.1% వడ్డీ వస్తుంది. వడ్డీపై కూడా ట్యాక్స్ ఉండదు. ఇది అందరికీ చాలా మంది పథకం. ఈ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్‌ని ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు లేదా ఏదన్నా బ్యాంక్, పోస్టాఫీస్‌లో అయినా వెళ్లి ఓపెన్ చేసుకోవచ్చు.
నేషనల్ పెన్షన్ స్కీం
నేషనల్ పెన్షన్ స్కీం అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకం. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలనుకుని భయంతో పెట్టలేకపోతే హ్యాపీగా ఈ నేషనల్ పెన్షన్ స్కీం తీసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ తప్పనిసరి
మీరు ఎన్ని పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నా ఇంట్లో సంపాదిచేది పెట్టుబడి పెట్టేది మీరే అయినప్పుడు.. మీకేదన్నా జరిగితే ఎలా? అందుకే ఇలాంటి పెథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి.