Gujarat: సింహం సింగిల్‌గా.. సినిమా సీన్ కాదు సుమీ..!
పై ఫోటోను చూసి ఏదో సినిమాలోని సీన్ అనుకుంటే పొరబడినట్లే. ఇది ఓ వ్యక్తి కళ్ల ఎదురుగా కనిపించిన దృశ్యం. గుజరాత్‌లోని (gujarat) దార్యకాంత ప్రాంతంలో ఓ సింహం (lion) ఇలా సముద్రపు ఒడ్డున నిలబడి అలలను ఎంజాయ్ చేస్తున్న అరుదైన దృశ్యాన్ని ఓ పోలీస్ పాట్రోలింగ్‌కి వెళ్తున్న సమయంలో క్లిక్‌మనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజ జీవితంలో నార్నియా సినిమాను చూస్తున్నట్లు అనిపించింది అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.
గుజరాత్‌లోని గిర్ జాతీయ పార్కులో ఉన్న సింహాలు ఇలా సముద్ర తీరం దగ్గర కనిపిస్తున్నాయని స్థానికులు కూడా చెప్తున్నారు. మరోపక్క ఇది ఆందోళన కలిగించే విషయమే. సింహాలు ఎక్కువగా విస్తరించి ఉన్న అడవుల్లో.. జాగా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసించేందుకు ఇష్టపడతాయి. వాటిని ఉంచే పార్కులు, జంతుశాలల్లో కానీ జాగా సరిపోకపోతే ఇలా బయటికి వచ్చేస్తుంటాయి. 1990ల కాలంలో గుజరాత్‌లోని సూత్రపద తీర ప్రాంతంలో ఎక్కువగా సింహాలు కనిపించేవి. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఓ సింహం ఇలా గుజరాత్‌లోని ఓ తీర ప్రాంతంలో కనిపించింది. (gujarat)