Ravindra Jadeja: నీకోసం ఏదైనా మ‌హీ భాయ్..!

Hyderabad: IPL 2023 ట్రోఫీని చెన్నై సూప‌ర్ కింగ్స్ (csk) గెలిచిన వేళ.. ర‌వీంద్ర జ‌డేజా (ravindra jadeja) పెట్టిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ట్రోఫీ ప‌ట్టుకుని మెంటార్, టీం కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీతో (ms dhoni) క‌లిసి ఫొటోలు దిగాడు జ‌డేజా. వాటిని ట్విట‌ర్లో పోస్ట్ చేస్తూ.. వ‌న్ అండ్ ఓన్లీ ధోనీ కోస‌మే ఇదంతా చేసాం. నీకోసం ఏదైనా మ‌హీ భాయ్ అని ట్వీట్ పెట్టాడు. దాంతో కొంత‌కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న వివాదం తుడిచిపెట్టుకుపోయిన‌ట్లే. వీరిద్ద‌రినీ ఇలా చూసి ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.