Telegram: టెలీగ్రాం అధినేతను ఎందుకు అరెస్ట్ చేసారు? రష్యా కుట్ర ఏంటి?
Telegram: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ అధినేత పవేల్ డురోవ్ అరెస్ట్ అయ్యాడు. నిన్న రపారిస్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఫ్రాన్స్ పోలీస్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు పవేల్ విషయంలో ఏం జరిగింది? అతని అరెస్ట్ వెనుక రష్యా హస్తం ఉందా?
పవేల్ టెలిగ్రామ్‌ను సృష్టించక ముందు రష్యాలో కోన్‌టాక్టే (VKontakte) అనే యాప్‌ను కూడా కనిపెట్టాడు. మనకు ఫేస్‌బుక్ ఎలాగో రష్యా వాసులకు కోన్‌టాక్టే అలాగన్నమాట. ఈ యాప్‌కు సంబంధించిన యూజర్ డేటా ఇవ్వాలని రష్యన్ అధికారులు పవేల్‌ను కోరారు. ఇందుకు పవేల్ ఒప్పుకోలేదు. దాంతో వారికి భయపడి 2014లో రష్యా నుంచి పారిపోయి దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు పవేల్‌కి UAEతో పాటు ఫ్రాన్స్ పౌరసత్వం కూడా ఉంది.
టెలిగ్రాంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా పవేల్ పట్టించుకోలేదన్న ఆరోపణలపై ఫ్రాన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రాంలో మలీ లాండరింగ్, డ్రగ్స్ మాఫియా, ప్రమాదకరమైన కంటెంట్‌ను షేర్ చేస్తున్నారు. దాంతో ఫ్రాన్స్ అధికారులు ఇలాంటి కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని ముందు నోటీసులు పంపారు. ఇందుకు పవేల్ స్పందించలేదు. దాంతో నిబంధనలను ఉల్లంఘించాడంటూ పవేల్‌ను అరెస్ట్ చేసారు.
టెలిగ్రాం సంస్థ ఆర్థిక నష్టాల్లో ఉంది. దీనికి కారణం పెట్టుబడిదారులు. అయితే.. కొన్ని సంస్థలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తామన్నా కూడా పవేల్ టెలిగ్రాంను అమ్మడానికి ఒప్పుకోలేదు. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు 2022లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్‌ను పెట్టారు. కానీ చాలా తక్కు మంది మాత్రమే సభ్యత్వం తీసుకునేవారు. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రి మెడ్వెడేవ్ పవేల్‌పై ఆరోపణలు చేస్తూ అతన్ని ఇలాగే వదిలేస్తే మరిన్ని దారుణాలకు పాల్పడతాడు అన్నారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తాయని అనడంతో ఫ్రాన్స్ అధికారులు అలెర్ట్ అయ్యారు.
పవేల్ రష్యాకు చెందినవాడు కావడంతో అతని యాక్సెస్ తమకు కావాలని.. అతని గోప్యతను సంరక్షించే బాధ్యత తమపై ఉందని రష్యా ప్రభుత్వం ఫ్రాన్స్‌కు లేఖ రాసింది. దీనిపై ఫ్రాన్స్ రష్యా అధికారులు చర్చలు జరుపుతున్నారు. పవేల్ టెలిగ్రాం ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న షాకింగ్ ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రాంను బ్యాన్ చేయాలనే సన్నాహాలు మొదలైపోయాయి.