Riyaz Khan: గజిని నటుడిపై షాకింగ్ ఆరోపణలు.. హీరోయిన్‌తో సెక్స్ విషయాలు మాట్లాడి..
Riyaz Khan: మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఈ కమిటీ ద్వారా చిత్ర పరిశ్రమలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న నటీమణులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి రేవతి సంపత్ ప్రముఖ తమిళ, మలయాళ నటుడైన రియాజ్ ఖాన్‌పై షాకింగ్ ఆరోపణలు చేసారు. గజిని సినిమాలో రియాజ్ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో.. రేవతి సంపత్ స్టిల్స్ చూసి ఫోటోగ్రాఫర్ నుంచి ఆమె నెంబర్ తీసుకుని ఆమెకు ఫోన్ చేసాడట. ఫోన్లో మాట్లాడుతున్న సేపు సెక్స్ గురించి భంగిమల గురించి మాత్రమే మాట్లాడాడని రేవతి సంపత్ మీడియా ముందు బయటపెట్టారు.
ఆ తర్వాత తనతో పడుకుంటావా అని నేరుగా అడిగేసాడని.. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్తే.. కనీసం వేరే అమ్మాయినైనా సెట్ చేస్తావా అని అడిగాడని వెల్లడించింది. దాంతో మలయాళ చిత్ర పరిశ్రమలో వివాదాస్పద ఛాయలు నెలకొన్నాయి. రియాజ్ ఖాన్‌పై ఆరోపణలు చేసిన రేవతే రెండు రోజుల క్రితం ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖిపై లైంగిక ఆరోపణలు చేసారు. 2019లో సిద్ధిఖి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని రేవతి సంపత్ హేమ కమిటీ ద్వారా ఫిర్యాదు చేసింది. దాంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (అమ్మా) జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖి ఆ పదవికి రాజీనామా చేసారు.