Viral News: కెమెరా ఆన్‌లో ఉందని తెలీక… జూమ్ కాల్‌లో మహిళ స్నానం!
Viral News: వీడియో కాన్ఫరెన్స్‌ను, జూమ్ కాల్స్ సమయంలో చాలా మందికి వికృత అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు మీటింగ్ సమయంలో కెమెరా ఆన్‌లో ఉందని తెలీక చేయకూడని పనులు చేస్తూ దొరికిపోతారు. కానీ ఓ యువతికి మాత్రం అసలు ఎవ్వరికీ జరగకూడని సంఘటన ఎదురైంది. వీడియో కాల్ ద్వారా ఆ యువతి అంత్యక్రియలకు హాజరైంది. అయితే తన కెమెరా ఆన్‌లో ఉందని తెలీక బాత్రూమ్‌లో ఫోన్ పెట్టుకుని స్నానం చేసేసింది.
ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ఉత్తర లండన్‌లోని బార్నెట్ చర్చిలో అంత్యక్రియలు జరుగుతండగా ఆ మహిళ కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. ఆమెతో పాటు చాలా మంది ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను చూడాలనుకున్నారు. అయితే అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆ మహిళ తన కెమెరా ఆఫ్‌లోనే ఉందనుకుని బాత్రూమ్‌లోకి వెళ్లి షవర్ చేసింది. అది కాల్‌లో ఉన్న అందరూ చూసారు. దురదృష్టం ఏంటంటే.. ఎవ్వరూ కూడా ఆమెకు ఈ విషయాన్ని చెప్పడం కానీ ఆమెను కాల్ నుంచి డిస్‌కనెక్ట్ చేయడం వంటివి కానీ చేయలేదు. అందరూ ఫ్రీ షో చూసినట్లు చూడటమే కాకుండా స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాపుల్లో షేర్ చేసుకున్నారు. ఈ విషయం ఆమెకు తెలీడంతో ఎంతో బాధపడింది.
2021లో కెనడా పార్లమెంట్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ పార్లమెంట్ సభ్యుడు వీడియో కాల్ మాట్లాడుతుండగా.. తన కెమెరా ఆఫ్‌లో ఉందనుకుని నగ్నంగా కూర్చున్నాడు. అప్పట్లో ఈ విషయం తీవ్ర దుమారానికి దారి తీసింది.