Viral News: నా సోదరుడు నగ్నంగా పెళ్లికి హాజరుకావాలి అంటున్నాడు
Viral News: చాలా మంది తమ పెళ్లిళ్ల విషయానికి వచ్చే సరికి అన్నీ గుర్తుండిపోయేలా ఉండాలి అనుకుంటారు. పెళ్లి వేడుకలో అందరూ ఒకే రకమైన దుస్తులు వేసుకోవాలని.. అమ్మాయి తరఫు వారు ఒక డ్రెస్ కోడ్ అబ్బాయి తరఫు వారు ఒక డ్రెస్ కోడ్..రకరకాల వంటలు ఇలా బోడెలు ఐడియాలు వేస్తుంటారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఓ యువకుడు మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా తన పెళ్లి జరగాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే.. తన పెళ్లికి అందరూ నగ్నంగా రావాలట. మీరు చదివింది నిజమే. ఆ యువకుడి సోదరి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. విచిత్రం ఏంటంటే.. ఆ అబ్బాయికి కాబోయే భార్యకు కూడా ఈ ఐడియా నచ్చిందట. దాంతో తనను కూడా నగ్నంగా పెళ్లికి రావాలని తన సోదరుడు చెప్పడంతో ఆ యువిత అవాక్కైంది. తన సోదరుడి పెళ్లి కాబట్టి తాను అడ్డురాలేకపోతున్నానని.. కానీ తాను మాత్రం ఇలా నగ్నంగా హాజరవడానికి సిద్ధంగా లేనని వెల్లడించింది.
ఆ యువతి తెలిపిన మరో విషయం ఏంటంటే.. ఆ యువకుడు.. అతను చేసుకోబోయే అమ్మాయి ప్రకృతి ప్రేమికులట. పుట్టినప్పుడు నగ్నంగానే పుట్టాం కదా వింతగా మాట్లాడుతుంటాడట. అయితే తాను అలా రాలేనని పాపం ఆ అమ్మాయి తన సోదరుడికి చెప్పడంతో వాడు కోపడ్డాడట. కావాలంటే తానే సపరేట్‌గా ఓ రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పిందట. అయినా ఆ అబ్బాయి వినడంలేదని పాపం ఆ యువతి బాధపడుతూ పోస్ట్ చేసింది. ఏంటో ఈ వింత మనుషులు వింత ఐడియాలు..!