Viral News: మేక‌ప్ వాడుకున్న అత్త‌గారు.. విడాకులు కోరిన కోడలు

Viral News: అత్త‌గారు త‌న‌కు తెలీకుండా త‌న మేక‌ప్ సామాగ్రిని వాడుకుంద‌న్న కోపంతో విడాకులు కావాల‌ని భ‌ర్త‌ను రాచిరంపాన పెట్టింది ఓ మ‌హిళ‌. ఈ ఘ‌టన ఆగ్రాలో చోటుచేసుకుంది. స్థానిక మాల్పుర ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు అక్క‌చెళ్లెళ్ల‌కు ఒకే కుటుంబానికి ఇచ్చి వివాహం జ‌రిపించారు. అయితే కొంత‌కాలంగా వారు వేరుగా ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇంట్లో ఉన్న త‌న మేక‌ప్ వ‌స్తువులు వాడొద్ద‌ని పెద్ద కోడ‌లు ఎన్నిసార్లు వారించినా ఆమె విన‌కుండా మేక‌ప్ వేసుకుంటోంద‌ట‌. దాంతో ఈ విష‌యం పెద్ద గొడ‌వ‌కు దారితీసింది. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్క‌డంతో ఇంత చిన్న విష‌యానికి విడాకులు ఎందుకు అని న్యాయ‌మూర్తి వారంద‌రినీ ప‌రివార్ ప‌రామ‌ర్శ్ కేంద్రానికి త‌ర‌లించి కౌన్సిలింగ్ ఇప్పించాల‌ని తీర్పు ఇచ్చారు.

ఇటీవ‌ల ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను హ‌నీమూన్‌కు గోవా తీసుకెళ్తానని చెప్పి అయోధ్య‌కు తీసుకెళ్ల‌డంతో ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోయిన ఘ‌ట‌న కూడా వైర‌ల్‌గా మారింది. ఎంటో ఈ మ‌ధ్య‌కాలంలో ఇలాంటి చిన్న విషయాల‌కే విడిపోతున్నారు దంప‌తులు.