ప‌రాయి స్త్రీల‌ను చూస్తున్నాడ‌ని.. ఏం చేసిందో తెలుసా?

America: త‌న‌ని కాకుండా ఇత‌ర మ‌హిళ‌ల వైపు చూస్తున్నాడ‌న్న కోపంతో ప్రియుడి కళ్ల‌లో పొడిచేసింది పై ఫోటోలో క‌నిపిస్తున్న మ‌హిళ‌. అమెరికాకు చెందిన సాండ్రా అనే మ‌హిళ‌.. ఫ్లోరిడాకు చెందిన వ్య‌క్తితో ప్రేమ‌లోఉంది. వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం అత‌నికి రేబీస్ సోక‌డం వ‌ల్ల రెండు ఇంజెక్ష‌న్లు కొని పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌ను పరాయి స్త్రీల‌ను చూస్తున్నాడ‌న్న కోపంతో అత‌నితో గొడ‌వ‌ప‌డింది. కోపంలో అత‌ను తెచ్చుకున్న రేబీస్ ఇంజెక్ష‌న్‌ను కంట్లో పొడిచేసింది. దాంతో వెంట‌నే అత‌ను పోలీసుల సాయంతో హాస్పిట‌ల్‌లో చేరాడు. సాండ్రాను పోలీసులు అరెస్ట్ చేసారు.