Viral News: బయటికెళ్లిన భర్త.. విద్యార్థితో టీచర్ సెక్స్..!
Viral News: భర్త లేని సమయంలో విద్యార్ధిని ఇంటికి పిలిపించుకుని అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఓ టీచర్ బాగోతం బయటపడింది. ఈ ఘటన వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది. సెంట్రల్ వ్యాలీ హై స్కూల్‌లో పనిచేస్తున్న కెన్నా అనే 25 ఏళ్ల టీచర్.. మైనర్ అయిన బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. 2022లో 17 ఏళ్ల విద్యార్థి తన టీచర్ అయిన కెన్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యాడు. అలా వీరిద్దరూ రోజూ మాట్లాడుకునేవారు. ఆ మాటలు కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కెన్నా భర్త ఇంట్లో లేకపోవడంతో ఆ విద్యార్ధిని ఇంటికి రప్పించుకుంది.
వీరిద్దరూ ఎక్కువగా కలుసుకుంటుండడం చూసిన ఇతర విద్యార్ధులు, టీచర్లు వీరిపై ఓ కన్నేసి ఉంచారు. వీరిపై నిఘా ఉంచడంతో సెక్సువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిసింది. దాంతో వెంటనే ఆ బాలుడి తల్లికి ఫిర్యాదు చేసారు. ఆమె కెన్నాపై కోర్టులో కేసు వేసింది. అయితే.. తనకు ఎక్కడ శిక్ష పడుతుందో అని కెన్నా కోర్టులోనే ఏడ్చేసింది. నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని కోరింది. అయినా ఆ బాలుడి తల్లి కరగలేదు. ప్రస్తుతానికైతే కెన్నాను స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.