ఆరుగురు భార్య‌లు…20 అడుగుల మంచం!

Brazil: ఓ వ్య‌క్తి ఏకంగా ఆరుగురు భార్య‌ల‌ను(wives) మెయింటైన్ చేస్తుంటాడు. అంతేకాదు.. వారితో క‌లిసి నిద్ర‌పోవ‌డానికి ఏకంగా 20 అడుగుల బెడ్ కూడా డిజైన్ చేయించాడు. ఈ వింత ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. బ్రెజిల్‌కి చెందిన ఉర్సో అనే వ్య‌క్తి మొద‌ట లౌనా క‌జాకీ అనే 27 ఏళ్ల యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో గొడ‌వ జ‌రిగి విడిపోయి మ‌ళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా ఉర్సోకి ప‌డ‌లేదు. అలా గొడ‌వ‌లు పెట్టుకుంటూ విడిపోతూ ఇప్ప‌టివ‌ర‌కు ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు. అయితే.. బ్రెజిల్‌లో పాలీఆమ‌ర‌స్ పాల‌సీ ఉంది. అంటే.. ఎంత మందినైనా పెళ్లి చేసుకోవ‌చ్చు. అలా ఇప్ప‌టివ‌ర‌కు ఆరుగురు యువ‌తుల‌ను పెళ్లి చేసుకున్న ఉర్సోకి ఒక ఐడియా వ‌చ్చింది. అయ్యిందేదో అయిపోయింది.. అంతా క‌లిసే ఉందాం అని అంద‌రినీ ఒకే ఇంటికి తెచ్చుకున్నాడు. అంతేకాదు..వారంద‌రితో క‌లిసి నిద్ర‌పోవాల‌ని ఏకంగా 20 అడుగుల బెడ్‌ను డిజైన్ చేయించాడు. ఇందుకోసం ఏకంగా రూ.80 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాడు. త‌న భార్య‌ల‌ను ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకోవాల‌ని ఇంత ఖ‌ర్చుపెట్టి బెడ్ తెప్పించాన‌ని, ఈ విష‌యంలో త‌న‌ను గిన్నీస్ బుక్‌లోకి ఎక్కించాల‌ని కూడా కోరుతున్నాడు.