“ఈ వ‌డ్లు తీసుకుని నా నామినేష‌న్‌కి ఒప్పుకోండి సార్”

a farmer gave grains to dm to file nomination

Viral News: ఓ జిల్లా క‌లెక్ట‌ర్‌కు వింత అనుభ‌వం ఎదురైంది. ఓ పేద రైతు త‌న ప్రాంతానికి ఏద‌న్నా మంచి చేయాలన్న భావ‌న‌తో నామినేష‌న్ వేయాల‌నుకున్నాడు. కానీ నామినేష‌న్ వేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ క‌ట్టాలి. ఆ డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఆ రైతు ఏకంగా త‌న పొలంలో పండిన ధాన్యం బ‌స్తాను క‌లెక్ట‌ర్‌కు ఇచ్చి నామినేష‌న్ వేయాల‌నుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

బ‌ల్లియా జిల్లాకు చెందిన జిల్లా క‌లెక్ట‌ర్ ర‌వీంద్ర కుమార్ త‌న కార్యాలయానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో వారి కష్టాల గురించి తెలుసుకుంటున్నారు. ఆ స‌మ‌యంలో అత‌నికి ఓ లేఖ అందింది. అందులో “” సార్.. నేను పేద రైతుని. ఈ ఎన్నిక‌ల్లో నామినేషన్ వేసి పోటీ చేసి గెలిచి నా ప్ర‌జ‌ల‌కు సాయం చేయాల‌నుకుంటున్నాను. అందుకు నా వ‌ద్ద డ‌బ్బుల్లేవ్. అందుకే ఈ ధాన్యం బ‌స్తాల‌ను తీసుకుని నా నామినేష‌న్ తీసుకోండి సార్ “” అని రాసుంది. అది చూసిన క‌లెక్ట‌ర్ న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత మంచి మ‌న‌సుతో అత‌నికి పేరుతో నామినేష‌న్‌ను ఉచితంగానే స్వీక‌రించారు.